Allu Arjun: సినీ హీరో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. నేను బాగానే ఉన్నాను.. ఆందోళన చెందవద్దని అభిమానులకు చెప్పారు. తానూ గత ఇరవై సంవత్సరాలుగా ప్రీమియర్ షోలకు వెళుతున్నాను అని చెప్పారు ఎప్పుడు ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగలేదన్నారు. తానూ ఎప్పుడు ప్రీమియర్ షోలు సంధ్య థియేటర్ లోనే చూస్తానని చెప్పారు.
నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు. నేను చట్టానికి కట్టుబడి ఉంటా. రేవతి కుటుంబానికి మరో సరి నా సానుభూతి.జరిగిన ఘటన దురదృష్టకరం.ఇది అనుకోకుండా జరిగిన ఘటన.నేను బాగున్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కోర్టులో కేసు ఉంది.. ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను.
ఇంటికి చేరిన అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు ఆత్మీయంగా స్వాగతం చెప్పారు. భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలు అర్హ, అయాన్ అల్లు అర్జున్ ను హత్తుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.అల్లు అర్జున్ ఇంటివద్ద ఎమోషనల్ దృశ్యాలు కనిపించాయి
ఈవార్త అప్ డేట్ అవుతోంది..
❤️🫶 pic.twitter.com/zg7PmFe8YW
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 14, 2024