Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న అరెస్ట్ అయి రిమాండ్ కు సినీ హీరో అల్లు అర్జున్ ను పంపించిన విషయం తెలిసిందే. ఆయనకు నిన్ననే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ నిన్ననే విడుదల అవుతారని భావించారు. అయితే టెక్నీకల్ అంశాల కారణంగా ఆయనను ఈరోజు అంటే శనివారం ఉదయం 6:40 గంటలకు జైలు నుంచి విడుదల చేశారు. బన్నీ జైలు నుంచి విడుదల కానున్నారనే సమాచారంతో అభిమానులు పెద్ద సంఖ్యలో చంచల్ గూడా జైలు దగ్గరకు చేరుకున్నారు. దీంతో జైలు అధికారులు ఆయనను వెనుక గేటు గుండా బయటకు పంపించారు. అల్లు అర్జున్ తన సొంత కారులో జైలు నుంచి బయలు దేరి వెళ్లారు. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్ అదే కారులో వెళ్లారు. అల్లు అర్జున్ కారుకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Allu Arjun Arrest LIVE Updates: అల్లు అర్జున్ అరెస్ట్ లైవ్ అప్డేట్స్
Allu Arjun:ఇక జైలు నుంచి నేరుగా అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే చాలా సేపు అయన ఉన్నారు. గీతా ఆర్ట్స్ కేరాలయం వద్ద నిర్మాత దిల్ రాజు, మరికొంత మంది సినీ ప్రముఖులు మరోవైపు అల్లు అర్జున్ ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు పెట్టి ఎవరినీ ఇంటివైపు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు.