Pushpa 2

Pushpa 2: దుమ్మురేపుతున్న ఫీలింగ్స్ సాంగ్!

Pushpa 2: ‘పుష్ప-2’ నుండి ఇప్పటికే విడుదలైన ‘కిస్సక్’ సాంగ్… ‘ఊ అంటవా మావా ఉ ఊ అంటావా మావ’ స్థాయిలో లేదనే విమర్శలు వచ్చాయి. మాస్ ఆడియెన్స్ ను సమంత సాంగ్ అలరించినట్టుగా ‘పుష్ప-2’లోని ఐటమ్ సాంగ్ మెప్పించలేదని అన్నవారూ ఉన్నారు. అయితే ఆ లోటు తీర్చడానికి అన్నట్టుగా ఆదివారం మేకర్స్ ‘పీలింగ్స్’ సాంగ్ ను రిలీజ్ చేశారు. చెన్నయ్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ చెప్పినట్టు ఇది పూర్తి స్థాయిలో మాస్ సాంగ్ ను తలపించింది. చిత్రం ఏమిటంటే… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంటే… ఈ పాటతో ఎక్కువ పాపులారిటీ రశ్మికా మందణ్ణకు లభించింది. ఒక నిమిషం వీడియోను కూడా ఈ పాటతో రిలీజ్ చేయడంతో రీల్స్ గా వీటిని కట్ చేసి… నెటిజన్స్ సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ ను క్రియేట్ చేశారు. అయితే… ఈ పాట మేకింగ్ ను తప్పు పట్టిన వారూ లేకపోలేదు. పాటలో హీరోహీరోయిన్లు వేసిన స్టెప్స్ లో గ్రేస్ లేదని, ‘బి గ్రేడ్’ భోజ్ పూరి సినిమాలోని పాటలను ఇది గుర్తు చేస్తోందని విమర్శించిన వారూ ఉన్నారు. ఏదేమైనా… ఈ పాట ‘పుష్ఫ-2’ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలువబోతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ రోల్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *