Pushpa 2

Pushpa 2: పుష్ప రాజ్ ఊచకోత.. బాహుబలి-2 రికార్డ్స్ బద్దలు కొట్టిన ఐకాన్ స్టార్

Pushpa 2: ఇండియన్‌ బాక్సాఫీస్ లో ‘పుష్ప-2’ సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. ఈ సినిమా ఇప్పటి వరకూ రూ. 1831 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు. కేవలం 32 రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. రూ. 1810 కోట్ల రూపాయలు వసూలు చేసిన ‘బాహుబలి-2’ వసూళ్లను తమ చిత్రం క్రాస్ చేసింది మేకర్స్ చెబుతున్నారు. రిలీజ్ కు ముందే ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సెన్సేషనల్ రికార్డ్ ను సాధించింది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సమకూర్చారు. సంక్రాంతి సినిమాలు వచ్చే లోగా ‘పుష్ప-2’ ఇంకెంత కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *