Thandel Movie: తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అదివారం గానంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరుకావాల్సింది. నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరూ గతంలో లవ్ స్టోరీ సినిమాలో జంటగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇప్పుడు మళ్ళీ తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ జోడి, మరోసారి అద్భుతమైన కాంబినేషన్ గా కనిపించనుంది.
చందూ మొండేటి దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు మరియు గ్లింప్స్ తో అభిమానుల hearts ను గెలుచుకుంది. సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్లపై మేకర్స్ మరింత వేగం పెంచారు. ఇప్పటికే చెన్నై, వైజాగ్ వంటి నగరాల్లో ప్రమోషన్లు నిర్వహించిన చిత్ర బృందం, ఆదివారం (ఫిబ్రవరి 2) హైదరాబాద్ లో తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
ఇది కూడా చదవండి: Amit Shah: యమునా నదిలో ముంచిన కేజ్రీవాల్ కటౌట్‌కి ఇపుడు ఎయిమ్స్‌లో చికిత్స జరుగుతుంది
అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రానున్నారని అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం, ఆత్మీయ అభిమానుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. పుష్ప 2 వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత బన్నీ వస్తున్న మొదటి ఈవెంట్ కావడంతో, ఆయన ఏం మాట్లాడుతాడోనని అభిమానుల ఉత్కంఠ తలెత్తింది. కానీ, చివరి నిమిషంలో బన్నీ ఈ ఈవెంట్ నుండి తప్పుకున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ వివరిస్తూ “బన్నీ ఫారెన్ నుండి వచ్చాడు. చాలా సివియర్ గ్యాస్ట్రిటిస్ (గ్యాస్ పెయిన్) వచ్చినందున అతడు ఈ ఈవెంట్‌కు రాలేకపోయాడు. ఈ విషయం మీ అందరికీ చెప్పమన్నాడు. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి” అని అన్నారు.
తాండల్ – అధికారిక ట్రైలర్:

