Allu Arjun

Allu Arjun: ఆమీర్ ఖాన్ మహాభారతంలో ఐకాన్ స్టార్?

Allu Arjun: సినీ ప్రియులకు గుడ్ న్యూస్! బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ మహాభారతం ఆధారంగా ఓ భారీ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆమీర్ స్వయంగా కృష్ణుడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే, ఇందులో అర్జునుడి పాత్ర కోసం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఆమీర్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఆమీర్ ఖాన్ ఇటీవల ముంబైలో అల్లు అర్జున్‌తో భేటీ అయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. మహాభారతం లాంటి భారీ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ నటిస్తే, అది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచిపోతుందని అభిమానులు ఉత్సాహపడుతున్నారు.

Also Read: Keerthy Suresh: బాలీవుడ్ లో కీర్తి సురేష్‌కి మరో ఛాన్స్?

Allu Arjun: అల్లు అర్జున్, ఆమీర్ ఖాన్ లాంటి ఇద్దరు భిన్న శైలి నటులు ఒకే వేదికపై కలిస్తే ఆ అనుభవం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ ఇవ్వడం పక్కా. మరి, ఈ ప్రాజెక్ట్‌ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఈ భారీ సిరీస్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *