Allu Arha: నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4 జరుగుతోంది. అందులో భాగంగా గత వారం అల్లు అర్జున్ ఈ షోలో సందడి చేశాడు. అయితే దానికి కొనసాగింపుగా ఈ వారం బన్నీ తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హతో పాల్గొనటమే కాదు రాబోయే ‘పుష్ప2’ గురించి అనే విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. ఇక అర్హను బాలకృష్ణ తెలుగు వచ్చా అనగానే అనర్గళంగా ‘అటజన కంచె’ పద్యాన్ని తప్పులు లేకుండా చెప్పటంతో తెలుగంటే మక్కువ చూపించే బాలకృష్ణ దగ్గరకు పిలిచి హత్తుకున్నాడు.
Allu Arha: ఇలాంటివి వింటున్నపు తెలుగు భాష సజీవంగా బతికి ఉంటుందని అర్హను అభినందించాడు. అయాన్ తో మీ నాన్నకు అర్హ అంటే ఇష్టమేమో అనగా బన్నీ ‘లేదు అయాన్ యానిమల్ లో రణ్ బీర్ కపూర్ లాంటి వాడు. తండ్రి కోసం ఏమైనా చేస్తాడు’ అని బదులిచ్చాడు. ఇక ఇదే ఎపిసోడ్ లో స్టార్ డమ్ గురించి, ఇన్ సెక్యూరిటీ, అసూయ వంటి విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ‘పుష్ప2’ బిజినెస్ గురించి కూడా డిస్కస్ చేశారు. ఈ ఎపిసోడ్ లోనే ‘పుష్ప2’ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లైన్ లోకి వచ్చి మాట్లాడాడు. ఇక ఈ ఎపిసోడ్ 22న స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ ఎపిసోడ్ కి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.