Allu Arjun

Allu Arjun: మరో ఘనత సాధించిన ఐకాన్ స్టార్

Allu Arjun: ‘పుష్ప’ మూవీతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎంతలా అంటే ఈ క్రేజ్ ఏకంగా హాలీవుడ్ మీడియాకు వెళ్ళింది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ‘ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్’ పేరుతో భారత్ లో అడుగు పెట్టింది.

Hollywood reporter

అయితే ఈ తొలి పత్రిక ముఖ చిత్రంగా అల్లు అర్జున్ ఫొటోతో రానుంది. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ టాప్ హీరోలకు కూడా దక్కని ఈ గౌరవం ఇప్పుడు బన్నీకి దక్కడం సంచలనంగా మారింది. ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ 1930 నుంచి డైలీ ట్రేడ్ పేపర్‌గా విదేశాల్లో చాల పేరుగాంచింది.

ఇది కూడా చదవండి: WPL 2025: లో దిల్లీ రెండో విజయం..! యూపీ కొంపముంచిన క్యాచ్ డ్రాప్

ఈ పత్రికకు ఆన్ లైన్ ఎడిషన్ కూడా ఉంది. అలాంటి ఈ మ్యాగజైన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ పై దృష్టి పెట్టి అల్లు అర్జున్ క్రేజ్ ని వాడుకొని భారత్ లోకి ఎంటర్ అయింది. తాజాగా అల్లు అర్జున్ కవర్ పేజీ ఫోటో షూట్‌ను కూడా నిర్వహించారు.

పూర్తి వీడియో: గంగో రేణుక తల్లి (జాతర) | పుష్ప 2 నియమం | అల్లు అర్జున్:

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *