Allu Arjun Arrest: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్ ను కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినపుడు హైడ్రామా చోటు చేసుకుంది . పోలీసులు అక్కడికి చేరుకోగానే అల్లు అర్జున్ ను తమతో స్టేషన్ కు రావాలని కోరారు . అయితే, అల్లు అర్జున్ ఉన్నపళంగా రమ్మంటే ఎలా ? అని పోలీసులను ప్రశ్నించారు . ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయనీ విచారణ కోసం వెంటనే రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు . దానితో అల్లు అర్జున్ అసహనానికి గురయ్యారు . వెంటనే రమ్మంటే ఎలా అని ప్రశ్నిస్తూనే , కనీసం బట్టలైనా మార్చుకోనివ్వరా అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. మీతో రావడం కోసం నాకేమీ అభ్యంతరం లేదని పోలీసులకు చెప్పారు. బట్టలు మార్చుకుని వస్తాను అన్నారు . అనంతరం పోలీసులు ఆయనకు డ్రస్ చేంజ్ చేసుకుని రమ్మని చెప్పారు . దీంతో అల్లు అర్జున్ దింటిలోకి వెళ్లి డ్రస్ చేంజ్ చేసుకుని వచ్చారు . తరువాత పోలీసులు తమతో పాటు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు .
అసలేం జరిగింది ?
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు . దీనిపై కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు . అయితే , ఈరోజు ఈ కేసు విచారణ కోసం పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ ను ఆయన ఇంటివద్దే అరెస్ట్ చేసిన ప్రస్తుతం ఆయన్ను చిక్కడపల్లి పీఎస్ స్టేషన్ కు తీసుకువెళుతున్నారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేశారు. సెక్షన్ 105, సెక్షన్ BNS 118(1) రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసులో విచారం నిమిత్తం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు .

