pushpa 3

Allu Arjun Arrest: పోలీసుల అదుపులో అల్లు అర్జున్!

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .  పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు .  దీనిపై కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు .  అయితే ,  ఈరోజు ఈ కేసు విచారణ కోసం పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.  అల్లు అర్జున్ ను ఆయన ఇంటివద్దే అరెస్ట్ చేసిన ప్రస్తుతం ఆయన్ను చిక్కడపల్లి పీఎస్ స్టేషన్ కు తీసుకువెళుతున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేశారు. సెక్షన్ 105, సెక్షన్  BNS 118(1) రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసు పెట్టారు .

అసలేం జరిగిందంటే..

పుష్ప-2 రిలీజ్‌ ముందు రోజు ప్రీమియర్ షోలు వేశారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్ షో అభిమానులతో చూడాలని అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యారు. దీంతో ఆరోజు రాత్రి 9:30 గంటల సమయంలో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్లారు. అక్కడ అప్పటికే  ఓ వైపు బన్నీ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సమయంలో ఈ సినిమా  చూడాలని వచ్చిన  ఓ కుటుంబం బలైపోయింది. సినిమా చూడాలనే కుతూహలంతో థియేటర్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి చివరికి ఆవేదనే మిగిలింది. సినిమా కారణంగా ఓ మహిళ మృతి.. ఈ ఘటన బన్నీ ఫ్యాన్స్‌ను సైతం కంటితడి పెట్టించింది. 

Allu Arjun Arrest: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్ సినిమా  పుష్ప 2 అర్ధరాత్రి ప్రీమియర్ షోలో విషాదం నెలకొంది. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడంతో జరిగిన తొక్కిసలాటలో దుర్ఘటన చోటు చేసుకుంది. స్క్రీనింగ్‌కు ముందు థియేటర్ గేట్ల వైపు భారీగా జనం రావడంతో గందరగోళం చెలరేగింది, ఇది తొక్కిసలాట లాంటి పరిస్థితికి దారితీసింది. అల్లు అర్జున్‌ను చూసేందుకు ఆసక్తిగా ఉన్న అభిమానులు, ఆయన  కనిపించడంతో గేట్ వైపు  వైపు పరుగులు తీశారు. జనాన్ని అదుపు చేసేందుకు మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జి చేశారు.

ఈ క్రమంలో  తొక్కిసలాట చోటు చేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి తన భర్త భాస్కర్‌తో పాటు వారి ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9), సాన్విక (7)తో కలిసి పుష్ప 2 ప్రీమియర్ షో చూడటానికి వచ్చారు. జనం గేట్లను నెట్టడంతో, రేవతి ఆమె కుమారుడు శ్రీ తేజ్ తోపులాటల మధ్యలో  స్పృహతప్పి పడిపోయారు.

“బాధితురాలు, 39 ఏళ్ల మహిళ, సంధ్యా థియేటర్ వద్ద అపస్మారక స్థితిలో పడిపోయింది చికిత్స కోసం దుర్గా బాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు,” అని పోలీసులు చెప్పారు . అయితే అక్కడికి చేరుకునేలోపే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ దుర్ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను కూడా ఇన్వాల్వ్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్  తరువాత పోలీసులు సంధ్య థియేటర్  మేనేజర్ తో సహా ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకుని తరలించారు. 

 

 

ఇది ఇప్పుడే అందిన వార్త.. అప్ డేట్ అవుతోంది. ముందుగా మహా పాఠకుల కోసం ఇవ్వడం జరిగింది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *