Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు అల్లు అర్జున్‌ను ఇప్పట్లో వదిలేలా లేదు. మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి ఆయన విడుదలైనా మనశ్శాంతి మాత్రం లేదని అనంతర పరిణామాలతో తెలుస్తున్నది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలై కోమాలోనే ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై ఒకవైపు ఆందోళన ఉండగా, మరోవైపు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు సుప్రీంకోర్టు వెళ్తారన్న వార్తతో మరింత గుబులు నెలకొన్నది. ఇదిలా ఉండగా, అభిమానులనూ ఈ కేసు వదిలేలా లేకుండా ఉన్నది.
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు అనంతర పరిణామాలతో కొందరు ఆయన అభిమానులు వివిధ రూపాల్లో సోషల్ మీడియా వేదికల్లో స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ, రేవంత్‌రెడ్డి సర్కార్‌పై అనుచిత పోస్టులు పెట్టారని తెలంగాణ పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో సోషల్ మీడియాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. దీంతో అల్లు అర్జున్‌కు షాకిచ్చినట్టయింది.
ఇది కూడా చదవండి: Rocking Rakesh: కెసిఆర్ సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ కి పేరుపేరునా కృతజ్ఞతలు
Allu Arjun: అభిమానులంటే తీవ్రంగా స్పందించే అల్లు అర్జున్‌కు ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఎంత మంది అల్లు అర్జున్ అభిమానులపై కేసులు నమోదయ్యాయయనే విషయం ఈ రోజులు తెలిసే అవకాశం ఉన్నది. ఇప్పటికే అరెస్టు, జైలు అనంతర పరిణామాలతో ఆందోళనగా ఉన్న అల్లు అర్జున్, ఆయన సర్కిల్‌కు అభిమానులపై కేసు ఘటన పుండుమీద కారం చల్లినట్టయిందని పేర్కొంటున్నారు.