Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును ఓ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తప్పుబట్టారు. తమిళనాడు రాష్ట్రంలో శివగంగా నియోజకవర్గ ఎంపీ అయిన కార్తీ చిదంబరం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయి జైలుకెళ్లి వచ్చిన అల్లు అర్జున్ గురించి పెద్ద ఎత్తున స్పందన కానవస్తున్నది. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన ఆయన అరెస్టుపై తాజాగా కార్తీ చిదంబరం స్పందించారు.
Allu Arjun: తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమైన అల్లు అర్జున్ అరెస్టుపై కార్తీ చిదంబరం నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ అరెస్టు విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో స్పందించిన తీరుపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆయనేమైనా బార్డర్‌లో యుద్ధం చేసి వచ్చాడా? సినిమా తీశాడు, డబ్బులు సంపాధించాడు? అంటూ అరెస్టును సమర్థిస్తూ హోంశాఖ మంత్రిగా కూడా ఆయన స్పందించారు. అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం అనవసరం.. అవసరమైతే ఇన్వెస్టిగేషన్‌కు పిలవాలి కానీ దీనికే అరెస్టు చేయడం సరికాదు.. అని కార్తి చిదంబరం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Allu Arjun: ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సొంత పార్టీకి చెందిన జాతీయ కీలక నేత అయిన ఎంపీ కార్తీ చిదంబరం పైవిధంగా స్పందించడంపై పార్టీలోనూ అల్లు అర్జున్ అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనడానికి నిదర్శనం. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల్లోనూ అల్లు అర్జున్ అరెస్టుపై విస్మయం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు స్పందించారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.

