Allu Arjun: డిసెంబరు 4వ తేదీన హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి మరియు గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి గురించి అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబం పట్ల తన దుఃఖాన్ని వ్యక్తం చేసిన అల్లు అర్జున్, కేసు విచారణ కొనసాగుతుండటంతో, ప్రస్తుతం శ్రీతేజ్‌ను, బాధిత కుటుంబాన్ని పరామర్శించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ,
“శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలుసుకుని నాకు చాలా బాధగా ఉంది. బాధిత కుటుంబం త్వరగా కోలుకోవాలని, వీలైనంత త్వరగా వారిని కలవాలని కోరుకుంటున్నాను” అన్నారు. అల్లు అర్జున్ వారి స్పందనలో, బాధిత కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, అల్లు అర్జున్ ఇంతవరకు ఆ బాలుడ్ని పరామర్శించలేదంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేసు విచారణ జరుగుతున్నందున తాను శ్రీతేజ్ ను కలవలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం క్షేమంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నానని తెలిపారు.