Allu arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 విజయోత్సవ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను “కల్యాణ్ బాబాయ్” అని సంభోదించి, ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది ముఖ్యంగా వీరిద్దరి మధ్య గతంలో ఉన్న వివాదాల నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంలో, అల్లు అర్జున్ పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేక జీవో పాస్ ద్వారా సినిమా టికెట్ రేట్లు పెంచడానికి అనుమతినిచ్చిన కారణంగా ఆయనను ప్రత్యేకంగా కొనియాడారు. “కల్యాణ్ బాబాయ్ థాంక్ యూ సో మచ్” అని అల్లు అర్జున్ చెప్పిన తరువాత, అభిమానుల కేరింతలతో చప్పట్లు కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ మధ్య సంబంధాలలో కొత్త పరిణామాలను సూచిస్తున్నట్లుగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.