Allari Naresh: అల్లరి నరేష్ తన 63వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఫ్యామిలీ డ్రామా’ దర్శకుడు మెహర్ తేజ్ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఆల్కహాల్’ అనే ప్రత్యేకమైన టైటిల్ ఖరారు చేశారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో నరేష్ ఆల్కహాల్ ప్రపంచంలో మునిగినట్లు చిత్రీకరించగా, భ్రమ మరియు వాస్తవికత మధ్య సాగే కథగా ఇది కనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ నరేష్ నుంచి మరో వైవిధ్యమైన కథను అందించనుందని సూచిస్తోంది.
Also Read: Kiran Abbavaram: ‘కే ర్యాంప్’తో కిరణ్ అబ్బవరం రీఎంట్రీ!
Allari Naresh: ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నరేష్ సరసన రుహాణి శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా నరేష్ అభిమానులకు కొత్త అనుభవాన్ని అందించనుందని టాక్.
DROWNING IN A DIFFERENT KIND OF HIGH…😎👊🏾
Presenting our hero @allarinaresh in a never before seen avatar on his special day ❤️
Wishing our dearest #AllariNaresh garu a very Happy Birthday! #HBDAllariNaresh 💫#Alcohol will grip you to the core very soon.@iRuhaniSharma… pic.twitter.com/ynKcrGfqA2
— Sithara Entertainments (@SitharaEnts) June 30, 2025