Revanth Reddy: రేవంత్ రెడ్డి చిత్రంగా ఇంటా… బయట వ్యక్తులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
అతను ఏం తప్పు చేస్తాడా… కార్నర్ చేద్దామని విపక్షాలే కాదు… స్వపక్షీయులూ ఎదురుచూస్తుంటారు. ఏ మాత్రం అప్పటడుగు వేసినా… విపక్షాలు బాహాటంగా విమర్శిస్తే…సొంత పార్టీ లోని అసమ్మతి వాదులు లోపల లోపల సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అదే జరిగింది.కేటీఆర్, బండి సంజయ్, లక్ష్మణ్ విమర్శించడం ఓకే అర్థం చేసుకోవచ్చు.కానీ దానం నాగేందర్ వంటి కాంగ్రేస్ ఎమ్మెల్యే కూడా… అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధగా ఉందని అన్నాడు… బెయిలు పై విడుదల కావడం ఆనందంగా ఉందన్నాడు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి అయితే… ఏకంగా ఇక మీదట ప్రీమియర్ షోస్ కు పర్మిషన్స్ ఇవ్వమని చెప్పేశాడు. సంక్రాంతికేమో ‘దిల్’ రాజు మూవీసే రెండు సొంత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. (గేమ్ ఛేంజర్… సంక్రాంతికి వస్తున్నాం… అలానే బాలకృష్ణ… డాకూ మహరాజ్ నైజాం రిలీజ్ రిలీజ్ చేస్తున్నాడు)ప్రతిపక్షాలతో పోరాటం చేస్తూనే… కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వాదులతోనూ పరోక్ష యుద్థం చేస్తున్నాడు.
తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి, అధిష్ఠానం దగ్గర తన స్థాయిని నిలబెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు.
