Aleti: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అంతర్గత కలహాలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెత్తనం కోసం చేస్తున్న చర్యలు మంత్రుల మధ్య అసంతృప్తికి దారితీస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తాజాగా రవాణా శాఖ పరిధిలోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం వివాదాస్పదమైంది. ఈ దాడులు రేవంత్ రెడ్డి పరిధిలోని ఏసీబీ అధికారుల ఆధ్వర్యంలో జరగడం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
ఈ పరిణామంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ “రేవంత్ రెడ్డి తన పెత్తనం చూపించడానికి చేస్తున్న చర్యల్లో మంత్రులు బలిపశువులు అవుతున్నారు. ఏసీబీ దాడుల వెనుక రాజకీయ ఉద్దేశం స్పష్టంగా ఉంది,” అని వ్యాఖ్యానించారు.

