Dhundandar: బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. అయితే ప్రేక్షకుల మాటల్లో మాత్రం విలన్గా నటించిన అక్షయ్ ఖన్నా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. రణ్వీర్ను డామినేట్ చేశాడంటూ సోషల్ మీడియా నిండా ప్రశంసలు కురిస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Ajay Bhupathi: గ్రాండ్ సాంగ్ తో హీరో ఎంట్రీ.. తిరుపతిలో సెట్ట్స్
రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, అదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధురంధర్’. ఈ సినిమా గత వారం విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కానీ ప్రేక్షకుల దృష్టంతా విలన్ పాత్రలో కనిపించిన అక్షయ్ ఖన్నా పైనే పడింది. ఈ ఏడాది ‘ఛావా’లోనూ విలన్గా నటించి మెప్పించిన అక్షయే ఇప్పుడు ‘ధురంధర్’లో మరింత శక్తివంతమైన ప్రదర్శన కనబరిచారు. రణ్వీర్ సింగ్ హీరో అయినప్పటికీ సినిమా మొత్తం అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నాడని, రణ్వీర్ను పూర్తిగా డామినేట్ చేశాడని సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. ఈ ప్రదర్శనతో అక్షయ్ ఖన్నా మళ్లీ టాప్ విలన్గా గుర్తింపు పొందుతున్నారు.

