Akkineni Nagarjuna: ప్రధాని నరేంద్ర మోదీని టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ వెళ్లి కలిశారు. నాగార్జునతోపాటు ఆయన సతీమణి అమల, కొడుకు, కోడలైన నాగచైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితోపాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. నాగార్జున తండ్రి, అలనాటి మేటి నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ అనే పుస్తకాన్ని ఈ సందర్భంగా మోదీకి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోదీ అక్కినేని నాగేశ్వరరావు ప్రతిభను కొనియాడారు. భారతీయ సినిమాకు అక్కినేని అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అక్కినేని సినీ చరిత్ర గురించి ఆయన కుటుంబ సభ్యులు, యార్లగడ్డ ప్రధానికి వివరించారు. అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ అనే పుస్తకంలో అక్కినేని మైలురాళ్లను పొందుపర్చామని వారు ప్రధానికి వివరించారు. నాగార్జున కుటుంబం గురించిన విశేషాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి: RC16 సెట్ లో పాల్గొన్న బాలీవుడ్ వైరల్ స్టార్!
ఆ తర్వాత అక్కినేని నాగార్జున కుటంబ సభ్యులు పార్లమెంట్‌కు వెళ్లినట్టు ఫొటోలు బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారాయి. పార్లమెంట్‌లో కలియదిరిగి విశేషాలను తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల మన్‌కీ బాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన సినీరంగానికి చేసిన సేవలను ఆరోజు ప్రధాని కొనియాడారు.

