Akhil Akkineni

Akhil Akkineni: ఘనంగా అక్కినేని అఖిల్ పెళ్లి.. హైదరాబాద్‌లో వైభవోపేత వేడుక!

Akhil Akkineni: హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో అక్కినేని అఖిల్ తన ప్రేయసి జైనబ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున వేద మంత్రాల నడుమ ఈ జంట ఒక్కటయ్యారు. ఈ వైభవోపేత వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్-ఉపాసన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరోలు సుమంత్, శర్వానంద్ ఈ జంటను ఆశీర్వదించారు. నాగచైతన్య బరాత్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఈ బరాత్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున ఈ కొత్త జంట కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఈ వేడుకకు హాజరవనున్నారు. గత ఏడాది నవంబర్‌లో జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం జరిగినప్పటికీ, నాగచైతన్య వివాహ పనుల కారణంగా ఈ పెళ్లి వాయిదా పడింది. హైదరాబాద్‌కు చెందిన జైనబ్ రవ్‌జీ ఓ కళాకారిణి. ఆమె ‘రిఫ్లెక్షన్’ పేరిట పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. జైనబ్ తండ్రి జుల్ఫీ రవ్‌జీ నిర్మాణ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్త. ప్రస్తుతం అఖిల్ పెళ్లి టాపిక్ నెట్టింటా బాగా ట్రెండ్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sai Rajesh: బాబిల్‌ ఖాన్‌ పై బేబీ దర్శకుడు ఆగ్రహం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *