Akhil Akkineni : మురళీ కిశోర్ డైరెక్షన్‌లో అక్కినేని అఖిల్

ఏజెంట్  డిజాస్టర్ తర్వాత వెండి తెరకు కాస్త బ్రేక్ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పుడు 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించే ఓ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని సమాచారం. అలాగే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ డైరెక్షన్‌లో మరో మూవీకి ఆయన ఓకే చెప్పినట్లు టాక్. ఇది తిరుపతి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఒక పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కథ బాగా నచ్చడంతో అక్కినేని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమాని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘లెనిన్‌’ టైటిల్‌ అనుకుంటున్నారని భోగట్టా.

సిసింద్రీ సినిమాతో బాల నటుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. చాలా చిన్న ఏజ్ లో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసాడు అని చెప్పొచ్చు. ఆ తర్వాత విక్రం కే కుమార్ దర్శకత్వం వహించిన మనం సినిమాలో కనిపించిన కాసేపు కూడా అద్భుతంగా అనిపించాడు. అక్కినేని నట వారసుల్లో అఖిల్ అద్భుతంగా సినిమాలు చేసి వారసత్వాన్ని నిలబెడతాడు అని అందరూ అనుకున్నారు. అఖిల్ హీరోగా పరిచయమైన సినిమా అఖిల్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *