Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పవన్ ఈ మధ్య తన కొడుకు అకిరాతో కలిసి ఎక్కువ కనిపిస్తూ ఉండడం ఫ్యాన్స్ లో మంచి ఎగ్జైట్మెంట్ ని తీసుకొచ్చింది. అయితే ఎప్పుడు నుంచో అకిరా సినిమా ఎంట్రీ కోసం పవన్ అభిమానులు ఎదురు చూస్తుండగా తన ఎంట్రీ మరో రెండేళ్ల తర్వాత ఉంటుందని తెలిసింది.అయితే అకిరా డెబ్యూ పవన్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే ఉంటుంది అని టాక్ వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ కొండంత అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఇందులో నిజం లేనట్టే వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఎర్లీ రూమర్స్ మాత్రమే అని టాక్. అకిరా డెబ్యూ రెండేళ్ల తర్వాత ఉంటుంది కానీ దర్శకుడు ఎవరు అనేది మాత్రం అప్పటికి డిసైడ్ అవుతుందట.కాబట్టి ఈ అవైటెడ్ డెబ్యూపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.