Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ తో అకిరా.. కిర్రాక్ లుక్.. నెట్టింటా వైరల్!

Pawan Kalyan: ఏపీ ఎన్నికల తరువాత అకిరా ఎక్కువగా పవన్ తో కలిసి కనిపిస్తున్నాడు. జనసేన విజయంతో అకిరా తన తండ్రితో మరింత దగ్గరయ్యాడు. తాజాగా పవన్ కళ్యాణ్ దక్షిణాది పర్యటనలో అకిరా కూడా వెళ్లాడు. ఆలయ దర్శనాల సమయంలో అకిరా తండ్రితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

తాజాగా కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ పూజల సమయంలో పవన్ కుమారుడు అకిరా కూడా తన తండ్రితోపాటు ఉన్నాడు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Chhattisgarh High Court: భార్యతో అసహజ లైంగిక సంబంధంలో తప్పు లేదు.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు వివాదాస్పద తీర్పు

అకిరా లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గడ్డం పెంచి, స్టైలిష్‌గా తయారైన అకిరా తెల్లటి కుర్తా, ట్రెడిషనల్ లుక్‌లో కనిపించాడు. పవన్ ఫ్యాన్స్ తండ్రికి తగ్గ కొడుకు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ తో ఎక్కువగా కనిపిస్తున్న అకిరా త్వరలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *