Lenin

Lenin: అఖిల్ ‘లెనిన్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!

Lenin: యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారైంది. నూతన సంవత్సరం సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో కాలర్ ఎగరేస్తూ కనిపించిన అఖిల్ లుక్ అభిమానులను ఆకర్షించింది. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ అవుతుంది.

Also Read: Sahakutumbanam Review: ”సఃకుటుంబానాం” సినిమా రివ్యూ & రేటింగ్!

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తొలుత శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనా, తర్వాత భాగ్యశ్రీ బొర్సె జాయిన్ అయింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జనవరి 5న ఈ పాట విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అఖిల్ కాలర్ ఎగరేస్తూ కూల్ మాస్ లుక్‌లో కనిపించాడు. కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌తో ఉన్న ఈ పోస్టర్ సినిమా పై అంచనాలను మరింత పెంచింది. రూరల్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ‘లెనిన్’ వేసవి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అఖిల్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *