Akhanda 2:నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ వేడుక నవంబర్ 28న అంగరంగ వైభవంగా అభిమానుల సమక్షంలో జరుపుకునేందుకు చిత్ర బృందం సమాయత్తమైంది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికి అధికారికంగా నేడు లేదా రేపు ప్రకటన వెలువడనున్నది.
Akhanda 2:అఖండ సినిమా సక్సెస్‌తో అఖండ-2పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్ షోల ప్రదర్శనకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు.
Akhanda 2:అఖండ-2 ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఇప్పటికే ఆ సినిమా నిర్మాతలు సన్నాహాల్లో మునిగిపోయారు. ఇదే ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కూడా మరో అతిథిగా ఆహ్వానించినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఈ వేడుకకు రాలేకపోతున్నారని సమాచారం. కుదిరితే వస్తానని కూడా నిర్వాహకులకు ఆయన సమాచారాన్ని చేరవేసినట్టు తెలిసింది. రాలేకపోతే సక్సెస్ మీట్‌లో తప్పక పాల్గొంటానని చెప్పినట్టు తెలుస్తున్నది.

