Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2 – తాండవం’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంపై సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తుందనే టాక్ హల్‌చల్ చేసింది.
విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయ్యింది. అయితే, ఈమె అఖండ 2 లో నటిస్తుందనే వార్తలపై ఈమె టీమ్ స్పష్టతనిచ్చింది. ‘అఖండ 2’లో విద్యా నటించడం లేదని, ఆమెకు ఈ ప్రాజెక్ట్‌తో సంబంధం లేదని తేల్చేసింది. దీంతో ఈ వార్త కేవలం రూమర్‌గా మిగిలిపోయింది.గతంలో బాలయ్య నటించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’లో విద్యా బాలన్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Jabilamma Neeku Antha Kopama OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’!
Akhanda 2: వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను మెప్పించడంతో ‘అఖండ 2’లోనూ ఆమె కనిపిస్తుందనే అంచనాలు రేకెత్తాయి. కానీ, ఆ ఊహాగానాలు ఖండితమయ్యాయి. ఇక ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలో కనిపించనుంది. మే నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి చేసి, ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.