Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో సూపర్ హిట్ చిత్రం ‘అఖండ’కు సీక్వెల్‌గా రాబోతున్న ‘అఖండ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read: Sidharth Malhotra: వివాదాల నీడలో సిద్ధార్థ్ మల్హోత్రా?
Akhanda 2: తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్ ప్రయాగరాజ్‌లో జరగనుంది. సుమారు రెండు వారాల పాటు ఇక్కడ షూటింగ్ కొనసాగనుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి ఊపులో సాగుతోంది. అఖండ 2ని గ్రాండ్‌గా పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ధృవీకరించారు. బాలయ్య యాక్షన్, బోయపాటి మార్క్ డైలాగ్స్‌తో ఈ చిత్రం మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.