Akhanda 2: నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా లేకుండానే ఈ యేడాది గడిచిపోతోంది. గత యేడాది సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దసరా కానుకగా వచ్చిన ‘భగవంత్ కేసరి’ మూవీ సైతం చక్కని సక్సెస్ ను చవిచూసింది. ఇక వచ్చే యేడాది కూడా బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో మొదటిది ‘డాకు మహరాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతోంది.
అలానే తాజాగా షూటింగ్ మొదలైన ‘అఖండ -2’ సినిమా విజయ దశమి ప్రారంభమయ్యే సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ… సెకండ్ హ్యాట్రిక్ కు శుభారంభం పలుకుతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాను నందమూరి తేజస్వినితో కలిసి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
బాలకృష్ణ బోయపాటి శ్రీను..అఖండ-2 రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఇక్కడ చూడండి..