Akhanda 2

Akhanda 2: అఖండ2: కొత్త ట్రైలర్ సంచలనం!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొత్త ట్రైలర్ విడుదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. బాలయ్య మాస్ ప్రెజెన్స్, థమన్ సంగీతం అదిరిపోయాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తూ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2’ సినిమాపై అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ లభించగా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వచ్చిన కొత్త ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్సులు, బాలకృష్ణ మాస్ ఎంట్రీలు, డైలాగ్ డెలివరీ ఈ ట్రైలర్‌ను మరింత హైలైట్ చేశాయి. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు అయింది. బిగ్ స్క్రీన్‌పై ఈ మాస్ తాండవం ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *