Akhanda 2

Akhanda 2: బాలయ్య బాబు డబుల్ ధమాకా… ‘ఓజీ’కి ఆల్ ది బెస్ట్, ‘అఖండ 2’ విడుదల డేట్ ఫిక్స్!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఒకవైపు తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాకు శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు తన లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ విడుదల తేదీని ప్రకటించారు. అసెంబ్లీ లాబీలో మంత్రులు, ఎమ్మెల్యేలతో చిట్‌చాట్ చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

అఖండ 2 డిసెంబర్ 5న విడుదల
మంత్రులు, ఎమ్మెల్యేలు ‘అఖండ 2’ విడుదల ఎప్పుడని బాలకృష్ణను అడగ్గా.. ఆయన స్పందిస్తూ, “ఎల్లుండి (సెప్టెంబర్ 25) తమ్ముడు పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదలవుతోంది. నా సినిమా ‘అఖండ 2’ డిసెంబర్ 5న విడుదలవుతుంది,” అని తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామని, హిందీ డబ్బింగ్ కూడా అద్భుతంగా వచ్చిందని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారని బాలయ్య వెల్లడించారు.

నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేద్దాం
సినిమాల గురించి మాట్లాడిన తర్వాత, బాలకృష్ణ రాజకీయాలపైనా దృష్టి పెట్టారు. “ఎమ్మెల్యేలుగా మన నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేద్దాం,” అని తోటి ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. మంత్రి సవిత జిల్లాకు ప్రత్యేక నిధులు అడుగుదామని అనగా, బాలకృష్ణ స్పందిస్తూ రాష్ట్రం మొత్తం సమానంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

‘అఖండ 2: తాండవం’ వివరాలు
‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2: తాండవం’ కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. మొదట సెప్టెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నా, రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు బాలకృష్ణ స్వయంగా డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *