Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటసింహం మరోసారి అఖండ రూపంలో రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా సినిమా అఖండ 2తో బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బస్టర్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తుంటే, ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలయ్య ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడని తెలుస్తోంది. అఖండ 2 ఫ్యాన్స్‌కు ఏ సర్‌ప్రైజ్ ఇస్తోంది?
Also Read: Tamannaah Bhatia: చాలా కాలం తరువాత స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన తమన్నా!
అఖండ 2తో నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలయ్య తెలుగుతో పాటు హిందీ డబ్బింగ్‌ను కూడా స్వయంగా చెప్పనున్నారు. ఇప్పటికే తెలుగు డబ్బింగ్ పూర్తి చేసిన ఆయన, త్వరలో హిందీ డబ్బింగ్ ప్రారంభించనున్నారు. గతంలో భగవంత్ కేసరి సినిమాకు హిందీ డబ్బింగ్‌తో నార్త్ ఆడియన్స్‌ను ఆకర్షించిన బాలయ్య, ఈసారి అఖండ 2తో మరింత హడావిడి చేయనున్నారు. రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.