Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన గత నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో భారీ చిత్రం “అఖండ 2” తాండవం సిద్ధమవుతోంది. దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ సీక్వెల్, పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
మేకర్స్ ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌తో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తాజా బజ్ ప్రకారం, ప్రస్తుతం టీమ్ మ్యాడ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌ను కంప్లీట్ చేసే పనిలో ఉంది. మునుపటి “అఖండ” సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈసారి బోయపాటి తన మార్క్ మాస్ సీన్స్‌తో దానికి ఎన్నో రెట్లు పవర్ఫుల్‌గా ఇంటర్వెల్ సీన్‌ను తెరకెక్కిస్తున్నారట.
Also Read: Bigg Boss 9 Telugu Host: బిగ్ బాస్ 9కి హోస్ట్ గా బాలయ్య.. టీఆర్పీలు బద్దలే!
Akhanda 2 : ఈ సీన్‌లో డివోషనల్ టచ్ కూడా ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ బ్యానర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ దద్దరిల్లేలా కనిపిస్తోంది. అభిమానుల్లో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అఖండ టైటిల్ సాంగ్ పూర్తి వీడియో చూడండి :