Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో సూపర్ హిట్ ‘అఖండ’ తర్వాత, ‘అఖండ 2 – తాండవం’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు. రెండు వారాల పాటు హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఈ ఫైట్స్‌ను రూపొందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ కానున్నాయని టాక్. ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమా మొత్తంలో మెయిన్ అట్రాక్షన్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం హిమాలయాల్లో బాలయ్య అఘోర పాత్ర కోసం కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: Natural Star Nani Speech: మామూలుగా లేదు కదా నాని స్పీచ్
Akhanda 2: సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. బోయపాటి-బాలయ్య కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’పై అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఈ చిత్రం మరో సెన్సేషనల్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.