Akhanda 2

Akhanda 2: అఖండ 2 థియేట్రికల్ రైట్స్‌కు హోరెత్తిన పోటీ?

Akhanda 2: బాలయ్య-బోయపాటి హిట్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ గ్లిమ్స్‌కు విశేష స్పందన లభించింది. ఈ క్రేజ్‌తో థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. పలు ఏరియాల్లో డీల్స్ ఖరారవుతున్నాయి. సీడెడ్‌లో శోభన్, నెల్లూరులో కావలి భరత్, గుంటూరు & ఓవర్సీస్‌లో రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, కృష్ణ & తమిళనాడులో నాని వెంకట్, ఈస్ట్ గోదావరిలో విజయలక్ష్మి సినిమాస్, కర్ణాటకలో కుమార్ ఫిల్మ్స్ రైట్స్ దక్కించుకున్నాయి. పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర, నైజాంలో చర్చలు జోరందుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటి నుంచి జూలై 10 వరకు రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తి చేయనున్నారు. మిగిలిన పాటలను జూలై చివరి వారం నుంచి ఆగస్టు 10లోగా తీసి, సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *