Vidaamuyarchi: తమిళ స్టార్ హీరో అజిత్ సంక్రాంతికి రావటం ఖాయమైంది. అయితే మైత్రీ సంస్థ నిర్మించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కాకుండా లైకా సంస్థ నిర్మిస్తున్న ‘విడాముయర్చి’ సినిమాతో పొంగల్ కు సందడి చేయబోతున్నాడు అజిత్. అర్జున్, త్రిష, రెజీనా నటిస్తున్న ఈ సినిమాకు మగై తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా 1997లో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా ‘బ్రేక్ డౌన్’ కి ఫ్రీమేక్ అని వినిపిస్తోంది. రోడ్ థ్రిల్లర్గా వచ్చిన ఈచిత్రంలో కర్ట్ రస్సెల్ నటించగా జోనాథన్ మోస్టౌ దర్శకత్వం వహించారు. దీంతో ఒరిజినల్ నిర్మాతల నుంచి లైకా సంస్థ లీగల్ నోటీస్ అందుకున్నట్లు తమిళ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘బ్రేక్ డౌన్’ సినిమా తీసిన పారామౌంట్ సంస్థ 15 మిలియన్ డాలర్స్ నష్టపరిహారం చెల్లించాలని లైకా ప్రొడక్షన్స్ కు నోటీస్ పంపించిందట. అయితే ఈ విషయంలో ‘విడాముయర్చి’ బృందం నుంచి స్పందన రాలేదు. ఇక అజిత్ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అజర్ బైజాన్ లో జరిగింది.
