Ajith Kumar: ఈ యేడాది పొంగల్ కు అజిత్ సినిమాలేవీ విడుదల కావడం లేదు. దాంతో అతని అభిమానులు కాస్తంత నిరాశకు గురయ్యారు. అయితే దానిని పోగొట్టే విజయాన్ని అజిత్ సాధించాడు. దుబాయ్ లో జరుగుతున్న 24 హెచ్ కారు రేసులో అజిత్ అద్భుత ప్రతిభ కనబర్చి తృతీయ స్థానంలో నిలిచాడు. భారత జాతీయ పతాకాన్ని వినువీధుల్లో ఎగరేశాడు. స్టార్ హీరోగా చక్కని గుర్తింపు ఉన్న అజిత్ కు మొదటి నుండీ రేసింగ్ అంటే ఆసక్తి. అనేక సార్లు దీని కారణంగా గాయాల పాలయ్యాడు. దుబాయ్ లో సైతం ప్రాక్టీస్ చేస్తుంటే అతని కారు సరిహద్దుల్ని ఢీ కొంది. అయినా వెనకడుగు వేయకుండా పోటీలో పాల్గొని విజయాన్ని సాధించడంతో అభిమానులు తమకు అజిత్ ఇచ్చిన పొంగల్ గిఫ్ట్ ఇదే అని భావిస్తున్నారు. తమిళ, తెలుగు నటీనటులు అజిత్ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియచేశారు. ఇదిలా ఉంటే.. అజిత్ నటించిన ‘విడాముయార్చి’ ఫిబ్రవరిలో రావచ్చని అంటున్నారు. అలానే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.
So so proud.. what a man. The one and only. Ajith Kumar 🫡🫡🫡👍🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳😘😘 pic.twitter.com/gSDyndHv4e
— Ranganathan Madhavan (@ActorMadhavan) January 12, 2025