Ajith Kumar: పొంగల్ బరిలో నిలిచే అజిత్ చిత్రం ఏదనే విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, సంక్రాంతి కానుకగా విడుదల అవుతుందని కొద్ది రోజుల క్రితం ప్రకటన వచ్చింది. అయితే తాజాగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ అజిత్ తో తాము నిర్మిస్తున్న ‘విడాముయార్చి’ మూవీని జనవరి 10న విడుదల చేస్తున్నట్టు తాజాగా తెలిపింది.
ఇది కూడా చదవండి: Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్!
Ajith Kumar: త్రిషా, అర్జున్ సర్జా, రెజీనా, ఆరవ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా నిజానికి దీపావళి కానుకగా విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఇప్పుడు కూడా ఈ రెండు చిత్ర నిర్మాణ సంస్థలు తగ్గేదే లే అంటూ పొంగల్ సీజన్ నే టార్గెట్ చేస్తున్నాయి. మరి అజిత్ ఈ రెండు సినిమాలలో దేనికి ఓటు వేసి సంక్రాంతికి రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.