Ajith Kumar: సంక్రాంతి బరిలో దిగాల్సిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఆయన నటించిన మరో చిత్రం ‘విడాముయార్చి’ కారణంగా వాయిదా పడింది. తీరా చూస్తే.. ‘విడా ముయార్చి’ని సైతం పొంగల్ కు విడుదల చేయలేక లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కరన్ చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూడకుండా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీని ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ తెలిపారు. త్రిషా హీరోయిన్ గా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. విశేషం ఏమంటే… ఏప్రిల్ 10న ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. అందులో ఒకటి ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాజా సాబ్’ కాగా, మరొకటి స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్ – కొంచెం క్రాక్’!
