Ajith Kumar

Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన హీరో అజిత్… వీడియో వైరల్.. ఏం జరిగిందంటే..

Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రేసింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. సినిమాలతో పాటు బైక్ రైడింగ్, కార్ రేసింగ్‌లపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తూ ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే ఈ రేసింగ్ పట్ల ఉన్న ప్యాషన్ వల్ల అజిత్ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

మరోసారి ప్రమాదానికి గురైన అజిత్

తాజాగా ఇటలీలోని మిసానో ట్రాక్ లో జరిగిన GT4 యూరోపియన్ ఛాంపియన్షిప్ రెండో రేస్‌లో పాల్గొన్న అజిత్ కారు ప్రమాదానికి గురైంది. రేస్ సమయంలో ట్రాక్ మీద అకస్మాత్తుగా ఆగిపోయిన కారును గమనించకపోవడంతో అజిత్ కారు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజిత్ కారు ముందు భాగం దెబ్బతినగా, అదృష్టవశాత్తు అజిత్‌కి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన కారు నుంచి సజావుగా నడుస్తూ బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Dulquer Salmaan: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దుల్కర్ సల్మాన్

ముచ్చటగా మూడోసారి ప్రమాదం

అజిత్ రేసింగ్‌లో పాల్గొంటూ ప్రమాదానికి గురవడం ఇది మొదటిసారి కాదు. గతంలో దుబాయ్‌లో ప్రాక్టీస్ సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒకసారి, పోర్చుగల్‌లో జరిగిన రేస్‌లో మరోసారి ప్రమాదానికి గురయ్యారు. ఇటలీ ఘటనతో ఇది మూడోసారి కావడం గమనార్హం. ప్రతిసారీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ, అజిత్ రేసింగ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే…

అజిత్ ఇటీవల “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అధిక్ రవి చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి రేసింగ్‌లో పాల్గొంటున్న అజిత్, అక్టోబర్‌లో తన తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *