Ajit Pawar:

Ajit Pawar: మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి దివంగ‌త అజిత్ ప‌వార్ ప్ర‌స్థానం

Ajit Pawar: మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ (66) ఈ రోజు (జ‌న‌వ‌రి 28) ఉద‌యం ఘోర విమాన ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన బారామ‌తిలో జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఆయ‌న ముంబై నుంచి వెళ్లిన లియ‌ర్ జెట్ 45 విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో ప్ర‌మాదానికి గురి తీవ్ర‌గాయాల పాల‌య్యారు. ఆ త‌ర్వాత కొంత‌సేప‌టికే క‌న్నుమూశారు.

Ajit Pawar: దేశ రాజ‌కీయాల్లో త‌నదైన ముద్ర వేసిన ప్ర‌ముఖ‌ రాజ‌కీయ నేత, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌కు ఆయ‌న స‌మీప బంధువు. శ‌ర‌ద్‌ ప‌వార్ శిశ్య‌రికంలో ఆయ‌న రాజ‌కీయాల్లో ఎదిగారు. 1982 నుంచి నాలుగు ద‌శాబ్దాల పాటు సాగిన ఆయ‌న రాజ‌కీయ జీవితం అనేక మైలురాళ్ల‌ను అధిగ‌మించి, అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య ఆయ‌న‌ ఉప ముఖ్య‌మంత్రి స్థాయికి ఎదిగింది.

Ajit Pawar: 1991లో అజిత్ ప‌వార్ బారామ‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి ఎంపీగా పోటీ చేసిన ఘ‌న విజ‌యం సాధించారు. అది ఇప్ప‌టికీ ఆయ‌న‌కు కంచుకోట‌గా మారింది. ఆ త‌ర్వాత అప్ర‌తిహాతంగా గెలుపొందుతూ మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ఏడు సార్లు ఉప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఏకైక నేత‌గా అజిత్ ప‌వార్‌కు ఘ‌న‌త ద‌క్కింది.

Ajit Pawar: అజిత్ ప‌వార్ ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్య‌మంత్రిగా, పార్టీ నేత‌గా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకున్నారు. ఆర్థిక‌, నీటి పారుద‌ల‌, గ్రామీణాభివృద్ధి, ఇంధ‌న వంటి కీల‌క మంత్రిత్వ‌ శాఖ‌ల‌ను స‌మ‌ర్థ‌వంత‌గా నిర్వహించిన మంత్రిగా గుర్తింపు పొందారు. 2023లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల కార‌ణంగా ఎన్సీపీ ప‌గ్గాల‌ను చేప‌ట్టిన అజిత్ ప‌వార్ అధికార మ‌హాయుతి కూట‌మిలో కీల‌క భాగ‌స్వామిగా కొన‌సాగారు. ప్ర‌స్తుతం ఫ‌డ్న‌వీస్ మంత్రివ‌ర్గంలో ఆయ‌న ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *