Aishwarya Rai: ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. ప్రజలు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కారు రోడ్డు ప్రమాదానికి గురైన వార్త ఒక్కసారిగా హల్‌చల్ చేసింది.
ఐశ్వర్య రాయ్ ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టినట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం ముంబైలోని జుహు ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమయంలో ఐశ్వర్య రాయ్ కారులో ఉన్నారో లేదో కూడా అధికారికంగా ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి: Cm chandrababu: కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇటీవలే రియల్ హీరో సోనూసూద్ సతీమణి సోనాలి కూడా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న వాహనం నాగపూర్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాజాగా ఐశ్వర్య రాయ్ కారు ప్రమాదానికి గురైన వార్తతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఐశ్వర్య రాయ్ వాడే హై ఎండ్ టయోటా వెల్‌ఫైర్ కారు ఎంతో భద్రత కలిగినదని చెబుతుంటారు. ఈ కారు ధర రూ.1.30 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
సెలబ్రిటీలు రోడ్డు ప్రమాదాలకు గురవడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇటీవలి కాలంలో సాధారణ విషయంగా మారింది. అయితే, రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, వేగం నియంత్రించుకోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.