బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి ఏ అప్డేట్ వచ్చిన ఇట్టే వైరల్ అవుతోంది. అయితే కొన్ని రోజులుగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం తెలియదు. అయితే అసలు విషయం ఏంటంటే.. ఐశ్వర్య రాయ్ కి ఇన్ స్టాగ్రామ్ లో సుమారు 14 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఆమె మాత్రం ఒక్క వ్యక్తినే ఫాలో అవుతున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరా అని కొందరు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు. ఆమె భర్త అభిషేక్ బచ్చన్. అవును ఐశ్వర్యరాయ్ ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ఒకే ఒక్క వ్యక్తి ఆమె భర్తనే. అలాగే తన భర్తతో కలిసి దిగిన ఎన్నో ఫోటోలను కూడా ఆమె అందులో షేర్ కూడా చేసింది.
ఐశ్వర్య రాయ్ అక్టోబర్ 22 న తన తల్లి, కుమార్తె ఆరాధ్యతో సహా తన కుటుంబంతో .. కజిన్ పుట్టినరోజు పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈ ఫోటోను ఐశ్వర్యారాయ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ ఫోటోలో అభిషేక్ బచ్చన్ కనిపించలేదు. దీంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ 20 ఏప్రిల్ 2007న వివాహ బంధంతో ఏకమయ్యారు. పెళ్లయిన 4 సంవత్సరాల తరువాత, ఈ దంపతులకు ఆరాధ్య జన్మించింది. ఆరాధ్యకు 12 ఏళ్లు నిండాయి. ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ తన కూతురి ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ఎప్పుడూ తన తల్లితోనే కనిపిస్తుంది. కాగా ఆరాధ్యకు కూడా అమ్మ అందమే వచ్చిందని.. తను పక్కాగా హీరోయిన్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

