Air India Plane Crash: గుజరాత్ అహ్మదాబాద్‌లో జూన్ 12న ఘోన విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం నివాసిత భవనాలపై కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఆ విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే అది అక్కడి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. దీంతో కనీవినీ ఎరుగని విపత్తు సంభవించింది.
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 229 మంది ప్రయాణికులు ఉండగా, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో ఉన్న 241 మంది చనిపోయారన్నమాట. విమానం ప్రమాదం జరుగుతుండగా, 11వ సీటులో ఉన్న విశ్వాస్ అనే ప్రయాణికుడు అత్యవసర ద్వారం గుండా దూకి ప్రాణాలు రక్షించుకొని మృత్యుంజయుడిగా మిగిలాడు.
Air India Plane Crash: మెడికల్ కాలేజీ హాస్టల్‌లో మెడికల్ విద్యార్థులు భోజనాలు చేస్తుండగానే విమానం అదే భవనంపై కుప్పకూలింది. దీంతో విమానం పడిన అంతస్థులోనే ఉన్న 24 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. విమానం ఆ భవనంలో పూర్తిగా ఇరుక్కొని బయటకు వెళ్లడంతో ప్రమాద తీవ్రత మరింతగా ఉన్నది.
Air India Plane Crash: మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రయాణికుల్లోని మొత్తం మృతుల్లో 169 మంది భారతీయులు ఉండగా, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. మరో ఏడుగురు పోర్చుగీస్, మరొకరు కెనడా వాసి ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి ఒక్కొక్కరికీ రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ఎయిర్ ఇండియా మాతృసంస్థ అయిన టాటా సన్స్ గ్రూప్ సంస్థ ప్రకటించింది.