Air India Flight in Thailand: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా, 100 మందికి పైగా ప్రయాణికులు థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో 3 రోజులు చిక్కుకున్నారు. వీరిలో 70 మంది ప్రయాణికులను 80 గంటల తర్వాత అంటే మరో విమానంలో భారత్‌కు పంపించారు. ఫుకెట్‌లో ఇంకా 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం AI377 నవంబర్ 16న అక్కడ నుంచి బయలుదేరాల్సి ఉంది.
Air India Flight in Thailand: నవంబర్ 16 రాత్రి, సాంకేతిక లోపం కారణంగా విమానం 6 గంటలపాటు వాయిదా పడింది. గంటల తరబడి వేచి ఉన్న ప్రయాణికులు ఆందోళన చేపట్టడంతో తర్వాత విమానాన్ని రద్దు చేశారు. అయితే, విమానం ఒకసారి బయలుదేరింది. కానీ సాంకేతిక లోపంతో రెండున్నర గంటల తర్వాత ఫుకెట్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఈ విధంగా ఫ్లైట్ 3 సార్లు వాయిదా పడింది.
ప్రయాణీకుల ఆరోపణ
Air India Flight in Thailand: ఎయిర్‌లైన్‌లోని సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. అయితే, ప్రయాణికులకు వసతి కల్పించామని, వారికి పరిహారం కూడా అందజేస్తామని ఎయిర్‌లైన్స్ మంగళవారం సాయంత్రం తెలిపింది. ప్రస్తుతం, దాదాపు 40 మంది ప్రయాణికులు ఫుకెట్‌లో ఉన్నారు, వారిని అర్థరాత్రికి ఢిల్లీకి పంపుతారు.