Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లండన్‌కు వెళ్తున్న నవ వధువు మృతి

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ లో నిన్న (జూన్ 12, 2025) అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనేక మంది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒక నవ వధువు కథ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. ఆమె పెళ్లి తర్వాత మొదటిసారిగా తన భర్తను కలవడానికి లండన్‌కు బయలుదేరిన సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది.

వివాహానంతరం మొదటి ప్రయాణంలోనే విషాదం:
రాజస్థాన్‌లోని బలోత్రాకు చెందిన ఖుష్బు రాజ్‌పురోహిత్ అనే యువతి ఈ దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఖుష్బుకు జనవరి 2025లో వివాహం జరిగింది. ఆమె భర్త లండన్‌లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత మొదటిసారిగా తన భర్తను కలవడానికి, అతనితో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎన్నో ఆశలతో ఖుష్బు లండన్‌కు బయలుదేరింది.

Also Read: Air India flight: ప్ర‌మాద ముప్పుతో వెన‌క్కి తిరిగొచ్చిన మ‌రో ఎయిర్ ఇండియా విమానం.. ఎందుకో తెలుసా?

Ahmedabad Plane Crash: ఖుష్బు తన భర్త వద్దకు వెళ్లడానికి అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాల్సి ఉంది. విమాన ప్రమాదంలో ఆమె మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించడంతో, ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
విమానాశ్రయంలో ఖుష్బును ఆమె తండ్రి దిగబెట్టడానికి వచ్చారు. ఆ సమయంలో తండ్రీకూతుళ్లు కలిసి దిగిన ఫోటో, విమానంలోకి వెళ్లే ముందు ఖుష్బు తీసుకున్న చివరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ప్రజల హృదయాలను బరువెక్కేలా చేస్తున్నాయి. ఎన్నో ఆశలు, కలలతో బయలుదేరిన నవ వధువుకు ఇలాంటి విషాదకర ముగింపు ఎదురవడం అందరినీ కలచివేస్తోంది. ఈ ప్రమాదం ఎంత మంది జీవితాలను ఛిద్రం చేసిందో ఈ ఒక్క ఘటనతో అర్థమవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *