Agri gold: అగ్రిగోల్డ్ మోసానికి గురైన బాధితులకు ఇప్పుడు ఊరట లభించింది. కేంద్ర అన్వేషణ సంస్థ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) బాధితులకు చెల్లింపులు ప్రారంభించింది. ఈడీ అధికులు అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను గుర్తించి, అటాచ్ చేసిన ఆస్తుల ద్వారా నష్టపోయిన డిపాజిటర్లకు డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు.
కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ మోసుకు సంబంధించిన బాధితుల సంఖ్య 19 లక్షలకు పైగా ఉంది. ఈడీ చేపట్టిన దర్యాప్తులో ఇప్పటికే 33 మందిపై చార్జిషీట్లు నమోదు చేశారు. బాధితుల నష్టాలను తగ్గించేందుకు ఈడీ ఈ చర్యలు చేపట్టింది. బాధితుల పట్ల న్యాయం జరిగే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
ప్రభుత్వం, సంబంధిత వ్యవస్థలు బాధితుల పట్ల మరింత జాగ్రత్తతో వ్యవహరించి, త్వరితగతిన నష్టపరిహారం అందించాలని ప్రజలు కోరుతున్నారు.