RC 16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ అభిమానులని చాలా దారుణంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత తన నుంచి సోలోగా వచ్చిన ఈ సినిమా చాలా దారుణంగా విఫలమయ్యింది. ఇప్పుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న తన 16వ సినిమా మీదే అభిమానుల అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై సాలిడ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ తరహాలోనే సాలిడ్ ఎపిసోడ్ ఒకటి RC 16లో కూడా ఉంటుందని టాక్. గేమ్ ఛేంజర్ ఫలితం ఎలా ఉన్నా కానీ ఆ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఎపిసోడ్ ఇంకా ఎక్కువ ఉన్నా బాగుండు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలో కూడా అలాంటి మంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అని టాక్. మరి రాబోయే ఈ భారీ ప్రాజెక్ట్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
