Murder

Murder: హైదరాబాద్‌లో అడ్వొకేట్ దారుణ హత్య..

Murder: హైదరాబాద్ చంపాపేట్ లో దారుణ హత్య జరిగింది. సంతోష్ నగర్ న్యూ మారూతీ నగర్ లో అడ్వకేట్ ఏర్రబాపు ఈశ్రాయిల్ ను దస్తగిరి అనే ఎలక్ట్రిషియన్ కత్తితో పొడిచి చంపాడు.

అసలేం జరిగిందంటే.. చంపాపేట్ సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్ కాలనీ లో ఏర్రబాపు ఇజ్రాయిల్ అడ్వొకేట్ ఉంటున్నాడు. అదే ప్లాట్ లో పైన ఉంటున్న ఓ మహిళను ఎలక్ట్రిషియన్ దస్తగిరి వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక ఇటీవల అడ్వొకేట్ ఎర్రబాపు ఇజ్రాయిల్ ను ఆశ్రయించింది బాధిత మహిళ . అయితే మహిళతో కలిసి పీఎస్ లో దస్తగిరిపై ఫిర్యాదు చేశాడు అడ్వొకేట్ ఎర్రబాపు ఇజ్రాయిల్.

Also Read: Salman Khan: రష్మిక కూతురితో కూడా ఆ పనిచేస్తా..?.. సల్మాన్ షాకింగ్ కామెంట్స్!

Murder: దీంతో కక్ష పెంచుకున్న ఎలక్ట్రిషియన్ దస్తగిరి తనపైనే కంప్లైంట్ చేస్తావా అంటూ అడ్వొకేట్ పై కత్తితో దాడి చేశాడు . వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అడ్వొకేట్ ఎర్రబాపు ఇజ్రాయిల్ మృతి చెందాడు. హత్య అనంతరం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు దస్తగిరి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kaleshwaram Commission: 1,000 పేజీలతో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *