Piyush Pandey: భారత అడ్వర్టైజింగ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన, ఎన్నో చిరస్మరణీయమైన యాడ్ క్యాంపెయిన్‌ల రూపశిల్పి, పియూష్ పాండే (70) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఒగిల్వీ (Ogilvy) ఇండియాకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మరియు వరల్డ్‌వైడ్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్‌గా పనిచేసిన పీయూష్ పాండే.. భారతదేశ ప్రకటనల విధానాన్ని మార్చేశారు. పాశ్చాత్య ధోరణిలో ఉన్న ప్రకటనలకు భిన్నంగా, సామాన్య భారతీయుల భాష, హాస్యం, సంస్కృతిని మేళవించి ఆయన సృష్టించిన ప్రకటనలు దేశ సాంస్కృతిక జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి.
Also Read: National High Ways: వాహనదారులా? మీకో బంపర్ ఆఫర్!
పాండే సృష్టించిన కొన్ని ఐకానిక్ క్యాంపెయిన్లు
ఫెవికాల్ (Fevicol): ‘ఈ ఫెవికాల్ జోడికి పగులు ఉండదు’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన బస్సు యాడ్, చేప యాడ్ వంటి హాస్యభరిత ప్రకటనలు ఒక జిగురును దేశమంతా మాట్లాడుకునేలా చేశాయి.
వోడాఫోన్ పగ్ (Vodafone Pug): ‘నువ్వు నేను’ అనే శీర్షికతో చిన్నారిని పగ్ కుక్క నమ్మకంగా అనుసరించే ఈ యాడ్.. ఒక టెలికాం నెట్‌వర్క్‌కి విశ్వసనీయతను తెచ్చిపెట్టింది.
కాడ్బరీ డైరీ మిల్క్ (Cadbury Dairy Milk): ‘కుచ్ ఖాస్ హై’ అనే ప్రసిద్ధ క్యాంపెయిన్, పెద్దలు కూడా చాక్లెట్‌ను ఆనందంగా తినవచ్చని చూపించింది.
ఏషియన్ పెయింట్స్ (Asian Paints): ‘ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది’ అనే నినాదంతో పెయింట్స్‌కు భావోద్వేగ స్పర్శనిచ్చారు.
పల్స్ పోలియో (Pulse Polio): అమితాబ్ బచ్చన్‌తో కలిసి రూపొందించిన ‘దో బూంద్ జిందగీ కే’ అనే అవగాహన కార్యక్రమం, దేశంలో పోలియో నిర్మూలనకు ఎంతో సహాయపడింది.
రాజకీయ నినాదం: 2014 సార్వత్రిక ఎన్నికల కోసం ఆయన సృష్టించిన “అబ్ కీ బార్, మోదీ సర్కార్” అనే నినాదం కూడా చారిత్రకమైంది.
2016లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించబడిన పీయూష్ పాండే.. తన సరళమైన, హృదయపూర్వక కథనాలతో అడ్వర్టైజింగ్ రంగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారు. ఆయన మరణం భారత సృజనాత్మక రంగానికి తీరని లోటు అని చెప్పాలి.

