ADLURI LAXMAN: రాష్ట్రంలోని గురుకుల హాస్టళ్ల మెస్ కాంట్రాక్టర్లకు ఏప్రిల్ వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన గురుకులాలపై నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా రెంటల్ బిల్డింగ్‌లలో నడుస్తున్న పాఠశాలలు, హాస్టళ్ల బకాయిలు త్వరలో చెల్లిస్తామని తెలిపారు. విద్యార్థులకు యూనిఫార్లు, బూట్లు, పుస్తకాలు అందించేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు తెలిపారు. నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా పనులు ఆలస్యం చేయకుండా, తమ దృష్టికి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని కార్పొరేట్ పాఠశాలలు “బెస్ట్ అవైలబుల్ స్కూల్” పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాల్సిందేనని ఆయన అన్నారు. అయితే కొన్ని పాఠశాలలు మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నాయని, మిగతావిచకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు.